"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

సి లాంగ్వేజ్ సాఫ్ట్‌వేర్



సి లాంగ్వేజ్ కి సంబందించిన ప్రోగ్రాములని కంప్యూటర్ మీద చెయదనికి దానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి 
ఆ సాఫ్ట్‌వేర్ మరియు దానిని ఏ విధంగా కంప్యూటర్ లో పొందుపరచాలో (ఇన్‌స్టాల్) క్రింద తెలుపబడినది ....

మీకు ఈ సమాచారం ఉపయోగపడినచో మీ అభిప్రయాన్ని కామెంట్ చేయండి 

ముందు మీరు సాఫ్ట్‌వేర్ ని క్రింద డౌన్‌లోడ్ అని ఉన్నది కదా దానిని క్లిక్ చేస్తే మీరు సాఫ్ట్‌వేర్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు




STEP 1: మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత FOLDER లో TC3SETUP అనే  పేరు ఉన్న ఫైల్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి  
STEP 2: పైన చెప్పిన విధంగా క్లిక్ చేస్తే మీకు ఒక విండో (WINDOW) క్రింద ఫొటొలో చూపించిన విదంగా వస్తుంది అందులొ OK  మీద క్లిక్ చేయండి


STEP 3: పైన చెప్పిన విధంగా క్లిక్ చేస్తే ఆ తర్వత మీకు ఇంకో విండో క్రింద ఫొటొలో చూపించిన విదంగా వస్తుంది అందులొ  UNZIP మీద క్లిక్ చేయండి


UNZIP మీద క్లిక్ చేయగానే మీకు క్రింద ఫొటో లో చూపించిన విధంగా ఇన్‌స్టాల్ అవుతున్నట్టు జరుగుతున్న పని(ప్రొసెస్) ని చూపిస్తుంది ఇప్పుడు మీరు దేనిని క్లిక్ చేయవద్దు 


STEP 4 :మొత్తం ప్రొసెస్ అయిపోగానే మీకు క్రింద చూపించిన విధంగా 399 files unzipped successfully అని చూపిస్తుంది అప్పుడు మీరు OK  పై క్లిక్ చేయండి




STEP 5 :ఇదే చివరి STEP TURBO C సాఫ్ట్‌వేర్ ని ఇన్‌స్టాల్ చేయడంలో ఇప్పుడు మీరు క్రింద చూపించిన విధంగా CLOSE మీద క్లిక్ చేయండి   



ఇంకా అయిపొయింది మీరు ఇప్పుడు C : Drive లో TC అనే  FOLDER ఉంటుంది  మళ్ళి TC లో BIN అనే FOLDER ఉంటుంది అందులో TC అనే file ఉంటుంది దానిని క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్‌వేర్ OPEN అవుతుంది ఇంకా కుమ్మేయండి ...ఫ్రెండ్స్

 మాటి మాటికి C:/TC/BIN/ లో కి వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటే మీరు C:/TC/BIN/ లో TC అనే ఫైల్ మీద RIGHT క్లిక్ చేసి SEND TO ---> Desktop (create shortcut )మీద క్లిక్ చేయండి. అప్పుడు Desktop మీద software shortcut  వస్తుంది 




2 కామెంట్‌లు:

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి