సి లాంగ్వేజ్ లో ప్రోగ్రాం వ్రాసే ముందు , మనం సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ని ఎలా వాడుకోవాలో చూద్దాం .
అరె బాబు ఇప్పటికే output input అని అర్ధం కాక చస్తున్నాం మళ్ళి ఈ తొక్కలో గొలెంట్రా బాబు అనుకుంటున్నారా .. హ మొదట్లో అర్ధం కాదు పోను పోను మీకే అర్ధం అవుతుంది .
ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో నా బ్లాగ్ చూడాలంటే ఒక సాఫ్ట్వేర్ ని వాడుకొని చూస్తున్నారు కదా అంటే Internet Explore లేదా Mozilla Fire Fox లేదా Google Chrome ఇంకా చాల ఉన్నాయ్ వీటిలో ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని మీరు నా బ్లాగ్ ని చూస్తున్నారు కదా . వీటిల్లో ఒక్కటి కూడా మీ దగ్గర లేదనుకోండి అప్పుడు మీరు ఇంటర్నెట్ వాడుకోలేరు .
అలాగే మీరు సి ప్రోగ్రాం లను వ్రాయాలంటే మనం ఖచ్చితంగా సి లాంగ్వేజ్ కి సంబందించిన సాఫ్ట్వేర్ లో మాత్రమే రన్ చేయాలి . దానిలో ఎలా ప్రోగ్రామ్స్ వ్రాసి ఔట్పుట్ చూడాలో చూద్దాం
సి లాంగ్వేజ్ సంబందించిన సాఫ్ట్వేర్ ని Turbo C అంటారు . దీనిని ఎలా కంప్యూటర్ లో install చేయాలో ఇక్కడ నొక్కి ( క్లిక్ ) చేసి చూడండి
సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ తర్వాత ఎలా ఉపయోగించి రాయాలో ఇప్పుడు చూద్దాం క్రింద చూపించిన ఫోటోలో లా desktop మీద ఒక ICON Symbol (ఎరుపు రంగు లో చూపించినది ) కనిపిస్తుంది . దానిని నొక్కండి .
కంప్యూటర్ ఇన్ తెలుగు |
పైన చూపించిన దానిని నొక్కిన తర్వాత ఒక విండో కింద చూపించిన విధంగా వస్తుంది .
కంప్యూటర్ ఇన్ తెలుగు |
ఇప్పుడు ఒక కొత్త ఫైల్ ని CREATE చేయడం ఎలా నో చూద్దాం . పైన ఒక మెనూ బార్ కనబడుతుంది కదా అందులో ఫైల్ అనే దాని మీద క్లిక్ చేయండి అందులో new కనపడుతుంది క్లిక్ చేయగానే కింద చూపించిన విదంగా వస్తుంది
కంప్యూటర్ ఇన్ తెలుగు |
కంప్యూటర్ ఇన్ తెలుగు |
నేను ముందే చాలా సార్లు చేప్పాను ఏమని అంటే మనం ఏ Programming language లో అయినా ఆల్‌గారిధమ్ వ్రాసినా దాన్ని బట్టి మాత్రమే Program వ్రాస్తాం . ఇప్పుడు మనం ఒక ఆల్‌గారిధమ్ వ్రాసి దాన్ని C Language లో ఎలా వ్రాస్తారో చూద్దాం
ముందుగా ఆల్‌గారిధమ్ రాద్దాం ఒక చిన్న మెసేజ్ ని ప్రింట్ చేయడం అది hello world అని దానికి సంబందించిన ఆల్‌గారిధమ్ కింద రాసానుచూడండి .
ముందుగా ఆల్‌గారిధమ్ రాద్దాం ఒక చిన్న మెసేజ్ ని ప్రింట్ చేయడం అది hello world అని దానికి సంబందించిన ఆల్‌గారిధమ్ కింద రాసానుచూడండి .
- Write a Algorithm To print a message "HELLO WORLD "?
STEP1: Start
Step2: print HELLOWORLD
STEP3: END
Same పైన వ్రాసిన ఆల్‌గారిధమ్ ని "C " లాంగ్వేజ్ లో ఎలా వ్రాస్తారో చూద్దాం
- Write a Program to print Hello world message At output ?
- ఆల్‌గారిధమ్ లో Starting step "start " . ఇక్కడ అంటే "C " Language లో Stating Step Void main().
- ఆల్‌గారిధమ్ లో STEP2 print HELLO WORLD కాబట్టి ఇక్కడ అంటే "C " Language లో printf(" hello world "); Use చేస్తాం .
- ఆల్‌గారిధమ్ లో STEP3 End చేయడం కాబట్టి ఇక్కడ Ending కి }
అ ప్రోగ్రాం క్రింద చూపించిన విదంగా వ్రాయాలి
void main()
{
printf(" Hello world ");
}
పైన ప్రోగ్రాం లో printf ("Hello world "); అంటే ఔట్పుట్ లో Hello world అని ప్రింట్ అవ్వాలి . ప్రింట్ అవ్వాలి అంటే system కి printf అంటే ఏం చేస్తుందో దానికి తెలియాలి . printf పని ఏమిటి బ్రాకెట్ లోపల ఎం రాసామో అది output స్క్రీన్ మీద కనపడేటట్టు చేయడం . అంటే అది కూడా ఒక పని నే కదా దాని ఒక ప్రోగ్రాం వ్రాయాలి printf చేసేపని గురించి కూడా మనం ప్రోగ్రాం రాయాలి అది కష్టం కాబట్టి మనం పడటం ఇష్టం లేక సి లాంగ్వేజ్ కనిపెట్టిన వారు దానికి సంబందించిన ప్రోగ్రాం ని అంతకముందే రాసారు మనం ఆ ప్రోగ్రామ్ ని ఇక్కడ ఉపయోగించుకుంటే చాలు అది ఎలా నో ఇప్పుడు చూద్దాం దాని కంటే ముందు ప్రోగ్రాం ఎలా ప్రాసెస్ ( Execute ) చేస్తుందో చూద్దాం .
మీకు అంతకముందు చేపాను , ఆల్‌గారిధమ్ అనేది step by step లో జరుగుతుంది అని అంటే step 1 దగ్గర నుండి మొదలు పెడితే అది వరుసగా step 2 step 3 ... అలా last step వరకు మనం అందులో రాసిన పనులను చేస్తుంది అని already మనకు తెలుసు ...
అలాగే ప్రోగ్రాం కూడా step by step మాదిరిగానే మనం రాసే steps ని ప్రాసెస్ ( Execute )చేస్తుంది. ఎలా అంటే ఆల్‌గారిధమ్ కి starting పాయింట్ start కదా అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయిన స్టార్టింగ్ పాయింట్ అనేది main() ఓకే నా ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి .
main ముందు void అని వ్రాసాం కదా ప్రస్తుతానికి దీనిని అలాగే గుర్తుంచుకోండి .. ముందు పాఠ్యాంశాలలో దాని గురించి క్లుప్తంగా చేపుతాను
ఇప్పుడు ప్రోగ్రాం ని Execute చేస్తే అది void main() దగ్గర మొదలవుతుంది దాని తర్వాత లైన్ లో ( పై ప్రోగ్రాం చూడండి ) " { " బ్రాకెట్ ఉంది main() మొదలు అని ఓకే . next లైన్ లో printf("Hello World"); అని ఉంది. దాని దగ్గరకు రాగానే దానికి printf ఏం చేస్తుందో అర్ధం కాదు . printf ఏం పని చేస్తుందో దాని గురించి పైన చెప్పాను కదా printf వర్క్ అవ్వాలి అంటే దానికి సంబందించిన ప్రోగ్రాం వాడుకోవాలి అని, printf కి సంబందించిన ప్రోగ్రాం మనం రాసిన ప్రోగ్రాం లో include చేసుకోవాలి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం
పైన #include <stdio.h > అని ఉంది కదా అంటే printf కి సంబందించిన ప్రోగ్రాం అనేది stdio.h అనే ఫైల్ లో రాసి ఉంది దానిని మనం మన ప్రోగ్రాం లో include చేసుకుంటున్నాం . ఇలా include చేసుకోవడం వాళ్ళ ఎప్పుడైతే ప్రోగ్రాం Execution అనేది printf దగ్గరకు రాగానే అది దానికి సంబందించిన ప్రోగ్రాం మన ప్రోగ్రాం లో include చేసి ఉందో లేదో void main () పైన చూస్తుంది ఇప్పుడు మన ప్రోగ్రాం లో #include <stdio.h > ఉంది కాబట్టి printf ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది . ఓకే ఇప్పుడు printf లో రాసినది ఏదైతే ఉందో అది output లో ప్రింట్ చేసి మళ్ళి ప్రోగ్రాంలో next లైన్ కి వచ్చి అక్కడ ఉన్న దానిని ప్రాసెస్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ " }" ఈ బ్రాకెట్ ఉంది అంటే main() close అయింది అని కాబట్టి ప్రోగ్రాం end అవుతుంది . ఈ విధంగా స్టెప్ బై స్టెప్ లొ జరుగుతుంది కంప్యూటర్ లో ....
ఇప్పుడు ప్రోగ్రాం ని Execute చేస్తే అది void main() దగ్గర మొదలవుతుంది దాని తర్వాత లైన్ లో ( పై ప్రోగ్రాం చూడండి ) " { " బ్రాకెట్ ఉంది main() మొదలు అని ఓకే . next లైన్ లో printf("Hello World"); అని ఉంది. దాని దగ్గరకు రాగానే దానికి printf ఏం చేస్తుందో అర్ధం కాదు . printf ఏం పని చేస్తుందో దాని గురించి పైన చెప్పాను కదా printf వర్క్ అవ్వాలి అంటే దానికి సంబందించిన ప్రోగ్రాం వాడుకోవాలి అని, printf కి సంబందించిన ప్రోగ్రాం మనం రాసిన ప్రోగ్రాం లో include చేసుకోవాలి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం
పైన #include <stdio.h > అని ఉంది కదా అంటే printf కి సంబందించిన ప్రోగ్రాం అనేది stdio.h అనే ఫైల్ లో రాసి ఉంది దానిని మనం మన ప్రోగ్రాం లో include చేసుకుంటున్నాం . ఇలా include చేసుకోవడం వాళ్ళ ఎప్పుడైతే ప్రోగ్రాం Execution అనేది printf దగ్గరకు రాగానే అది దానికి సంబందించిన ప్రోగ్రాం మన ప్రోగ్రాం లో include చేసి ఉందో లేదో void main () పైన చూస్తుంది ఇప్పుడు మన ప్రోగ్రాం లో #include <stdio.h > ఉంది కాబట్టి printf ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది . ఓకే ఇప్పుడు printf లో రాసినది ఏదైతే ఉందో అది output లో ప్రింట్ చేసి మళ్ళి ప్రోగ్రాంలో next లైన్ కి వచ్చి అక్కడ ఉన్న దానిని ప్రాసెస్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ " }" ఈ బ్రాకెట్ ఉంది అంటే main() close అయింది అని కాబట్టి ప్రోగ్రాం end అవుతుంది . ఈ విధంగా స్టెప్ బై స్టెప్ లొ జరుగుతుంది కంప్యూటర్ లో ....
ఇప్పుడు మీకు ఒక డౌట్ ( సందేహం )రావాలే హ నాకు తెలుసు అరె వెధవ పైన చెప్పావు కదా రా ప్రోగ్రాం Starting పాయింట్ అనేది void main () అని మళ్ళి ఇక్కడేమో #include <stdio.h > అని లైన్ లో రాసావు అని .
హ మాష్టారు కోపడకండి వస్తున్నా మనం ప్రోగ్రాం రాసేది void main () దగ్గర నుండే మనం మన ప్రోగ్రాం లో printf వ్రాసాం కాబట్టి దానికి సంబందించిన ప్రోగ్రాం include చేసుకోవాలి కాబట్టి void main () పైన ఆ లైన్ రాసాం . ఇప్పుడు మన ప్రోగ్రాం లో అసలు printf ని వాడలేదనుకోండి #include <stdio.h > ని రాయాల్సిన అవసరం లేదు.
void main () పైన ఏమి రాసిన ప్రోగ్రాం execution అనేది void main () దగ్గర నుండే జరుగుతుంది కాబట్టి void main () నే starting పాయింట్ .
printf syntax:
printf (" ఈ కొటేషన్'s మద్యలో ఏది వ్రాస్తే అది output లో ప్రింట్ అవుతుంది ");
Examples On printf :
- printf(" hai ") ; -----------------> hai అని output లో ప్రింట్ అవుతుంది
- printf(" siva naadh baazi is great "); --------------------> sivanaadh baazi is గ్రేట్ అని output లో ప్రింట్ అవుతుంది
- printf("your name");----------------------> your name అని output లో ప్రిన్త్ఫ్ అవుతుంది
" Printf work అవ్వాలి అంటే printf కి సంబంధించిన program already వ్రాసి వుంది దాన్ని మనం include చేసుకోవాలి అదే మనం void main() పైన వ్రాసిన stdio.h ఈ file లో printf కి సంబంధించిన program ఉంది కాబట్టి దాన్ని #include ద్వార ఈ program లో కి Include చేసుకున్నాం"
ఇప్పుడు program
ని compile చేద్దాం compilation కోసం ALT+F9 ని Press చెయ్యాలి .
అప్పుడు program లో ERRORS ఉంటె Error's ని చూపిస్తుంది లేక పోతే Errors
దగ్గర 0 అని చూపిస్తుంది .
compilation
తర్వాత మనం Output చూడాలి కాబట్టి Output చూడాలి అంటే CTRL+F9 press
చేయాలి . CTRL+F9 PRESS చేస్తే Output వస్తుంది
కానీ ఇప్పుడు పైన వ్రాసిన Program వ్రాసి OUTPUT చూస్తే రాదు
ఎందుకంటే OUTPUT వస్తుంది . గాని Output స్క్రీన్ మనకి కనిపించదు . మరి
ఇప్పుడు Output చూడాలి అంటే ALT+F5 press చేస్తే వస్తుంది output క్రింద చూపించిన picture లో చూడండి
pro1 |
ok
నా . ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా . ఓకే మళ్ళి PROGRAM ని compile చేసి
Execute చేసి output చూద్దాం. ఈ output ని క్రింద చూపించినా Picture లో
లాగా వుంటుంది .
pro2 |
పైన OUTPUT లో Hello world Hello world అని రెండు సార్లు print అవుతుంది . కాని మనం రాసిన Program లో Hello world అని printf లో వ్రాసింది ఒక్క సారే . కాబట్టి ఒక్కసారే output లో print అవ్వాలి . కాని ఇక్కడ రెండు సార్లు ఉంది అందులో First Hello world అనేది అంతకముందు ఒకసారి program యొక్క Output చూస్యం కదా అది దాని Output. ఇంక్కోసారి Hello world అని రెండవ సారి print అయింది కదా అది ఇప్పుడు Output చూసినా Program Output.
అంతకముందు
program Output మనకి అవసరం లేదు .మనకి కేవలం present program output వరకు
మాత్రమే చాలు కాబట్టి previous program output ని clear చేసేయాలి .
కాబట్టి మనం ప్రోగ్రాం లో " clrscr() " అనే statement ని వ్రాయాలి .
clrscr() --------> అంటే clear screen అని meaning
clrscr() work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .
ఇప్పటి
వరకు మనం Ctrl+F9 Press చేస్తే Output ని చూడలేకపోతున్నాం . అంటే output
Screen మనకి కనిపించడం లేదు . Output screen ని Ctrl+f9 press చేసినప్పుడు
చూడాలి అంటే మనం " getch () " అనే
ఒక statement ని Ending Bracket ముందు వ్రాయాలి
getch ()
------> అంటే Get character అని meaning ఇది Output Screen ని ఏదయినా
key press చేసే అంత వరకు అలాగే ఉంచుతుంది . దీని అసలైన ఉపయోగం తర్వాత
చేపుతాను ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి
getch () ------> work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .
కాబట్టి Final గా పైన Program ని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు
#include < stdio.h >
#include < conio.h >
#include < conio.h >
void main()
{
{
clrscr();
printf(" Hello world ");
getch();
}
}
పైన ప్రోగ్రాం లో అంటే printf () లో రాసినది output స్క్రీన్ మీద రాసిన తర్వాత అది తర్వాత లైన్ లో getch () దగ్గరకు వస్తుంది . అంటే ప్రోగ్రాం అనేది getch () చేసే పని చేయాలి ఇప్పుడు getch () పని ఏమిటి ఏదైనా ఒక key press చేయాలి . కీ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ప్రోగ్రాం లో తర్వతః లైన్ లో ఉన్న code (మనం రాసిన statement ) అనేది Execute చేస్తుంది . ఇప్పుడు next లైన్ లొ " } " closing బ్రాకెట్ ఉంది .
అంటే printf లోది output లో రాసిన తర్వాత కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్ లొ getch దగ్గర ఆగుతుంది అంటే getch చేసే పని కోసం వెయిట్ చేస్తుంది .. అంటే మనం ఏదైనా key press చేసే వరకు అలాగే ఉంచుతుంది ఎప్పుడైతే కీ ప్రెస్ చేస్తామో అప్పుడు కంట్రోల్ next లైన్ లో ఉన్న దానికి వెళ్తుంది ఇక్కడ ఈ } ఉంది కాబట్టి ఇంకా ప్రోగ్రాం క్లోజ్ అవుతుంది
ఇప్పుడు మీకు అర్ధం అవి ఉంటుంది output స్క్రీన్ ఎందుకు అలాగే ఉంటుందో getch వాడితే ...
ఇప్పుడు మనం ఎన్ని సార్లు వెంట వెంటనే output చూసినా output లో ఒక్క సారి మాత్రమే print అవుతుంది ......
I like all the reviews have been posted by the visitors ofthis site ,some of them are very good suggested regard the article.Embroidered shirts
రిప్లయితొలగించండి#include
రిప్లయితొలగించండి#include
Void main ()
{
Clrscr();
Printf("your explanation is very good ");
Getch();
}
Thankyou
రిప్లయితొలగించండి