కంప్యూటర్ కి అర్ధమయ్యే బాష బైనరీ లాంగ్వేజ్ అని మనకు తెలిసిందే కదా . అంటే కంప్యూటర్ లో ఏమి store చేసిన అది బైనరీ లాంగ్వేజ్ లో కి మార్చుకొని అప్పుడు మెమరీ లో దాచుకుంటుంది .
ఈ మెమరీ లోపల ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న బాక్స్ లు లాగా divide చేసి ఉంటుంది . ఒక్కొక్క బాక్స్ ని CELL అని అంటారు .
ఇంతక ముందు చెప్పాను మీకు మెమరీ అనేది ఖాళీ స్థలం లాంటిది అని , ఖాళీ స్థలం లో ఒక ఇంటిని కడితే ఆ ఇళ్ళు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది దానిని మనం మీటర్స్ / సెంట్లు అని కొలుస్తాం కదా . next ఆ ఇంటికి ఒక నెంబర్ వస్తుంది కదా దానిని డోర్ నెంబర్ అంటాం అంటే అడ్రస్ వస్తుంది ..
స్థలాన్ని మనం సెంట్లు / మీటర్స్ లో కొలుస్తాం కదా అలాగే మెమరీ లో ఏదైనా స్టోర్ చేసినప్పుడు కొంత ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది కదా దాన్ని కొలవడానికి మనకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి
- Bit (బిట్) : 0 లేదా 1 ని బిట్ అంటారు ఇది మెమరీ యొక్క అతి చిన్న ప్రమాణం పైన చెప్పను కదా మెమరీ అనేది చిన్న cells గా విభజించబడి ఉంటుంది అని ఒక్కొక్క సెల్ ఒక 0 లేదా 1 ని మాత్రమే దాచుకోగలదు
- Byte (బైట్) : 8 బిట్స్ ని కలిపి బైట్ అంటారు ( example : మనం వాడే అంకెలలో 6 అంకెలుని కలిపితే లక్ష అని ఎలా అంటామో ఇది అంతే )
- Kilo Byte ( కిలో బైట్ ) : 1024 బైట్ లను ఒక Kilo Byte అంటారు
- Mega Byte ( మెగా బైట్ ) : 1024 Kilo Byte లను ఒక Mega Byte అంటారు
- Giga Byte ( గిగా బైట్ ) : 1024 Mega Byte లను ఒక Giga Byte అంటారు
అంటే మెమరీ లో ఏదైనా స్టోర్ చేయగానే అది కంప్యూటర్ కి అర్ధం అయ్యే బాష లోకి మారి అప్పుడు store అవుతుంది. ఇప్పుడు 5 అని కీబోర్డ్ లో నొక్కగానే అది మెమరీ లో బైనరీ లాంగ్వేజ్ లో కి మారి అప్పుడు మెమరీ లో ఒక్కొక్క సెల్ లో ఒక్కొక్క బిట్ స్టోర్ అవుతుంది
ఇలా 5 అనేది మెమరీ లో స్టోర్ అవుతుంది ఇలా స్టోర్ కాగానే ఒక్కొక్క cell కి ఒక నెంబర్ కంప్యూటర్ ఇస్తుంది దీనినే అడ్రస్ లొకేషన్ అంటారు కింద బొమ్మలో 5 అనేది అడ్రస్ లొకేషన్స్ 100 నుండి 102 వరకు ఉంది అని అర్ధం
ఇలా ప్రతిది మెమరీ లో బైనరీ లోకి మారి store అవుతుంది అది సాంగ్ లేదా వీడియో ఇంకేదైనా కావచ్చు . ఇప్పుడు పైన 5 అనేది ఎన్ని cells ని ఆక్రమించింది అంటే 3 కదా అదే దాని సైజు . దాన్ని 3 bits అని చదవాలి
ఇలా కంప్యూటర్ లో మనం ఏమి చేసిన మెమరీ లో ఒక అడ్రస్ లొకేషన్ లో save అవుతుంది
మీకు అర్ధం అయినా అవ్వక పోయినా కామెంట్ చేయండి
Chala bagundi mama
రిప్లయితొలగించండిChala baga ardhamayye vidhamga chepparu
రిప్లయితొలగించండి